డాన్ 3 సెట్స్ మీదకు వెళ్లేది అప్పుడే!
on Aug 16, 2023
ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాలు, సెట్స్ మీదున్న సినిమాలే కాదు, త్వరలో స్టార్ట్ కాబోయే సినిమాల మీద కూడా ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. సేమ్ డిస్కషన్ డాన్ 3 మీద కూడా ఉంది. కాకపోతే డబుల్ ఇంపాక్ట్ కనిపిస్తోంది అక్కడ. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది డాన్ 3. షారుఖ్‌ఖాన్ ప్లేస్‌లో రణ్‌వీర్ సింగ్‌ని తీసుకుని డాన్ 3 ని చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఫర్హాన్ అక్తర్ డీటైల్డ్‌గా మాట్లాడారు. ఈ సినిమా 2025 నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని డిక్లేర్ చేశారు ఫర్హాన్ అక్తర్. లాస్ట్ వీక్ రివీల్ చేశారు డాన్ 3 గురించి. ఇందులో రణ్‌వీర్ సింగ్ డాన్‌గా నటిస్తారని అనౌన్స్ చేశారు. ఒక్కసారిగా ఇంటర్నెట్ షేక్ అయింది. అయితే డాన్‌లో షారుఖ్‌ని రణ్‌వీర్ సింగ్ రీప్లేస్ చేయడం పట్ల కొందరు ఎగ్జయిట్ అయితే, మరికొందరు అదేంటని పెదవి విరిచారు.
ఫర్హాన్ మాట్లాడుతూ ``రణ్‌వీర్ సింగ్‌ని కొత్త డాన్‌గా ప్రేక్షకులు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. రణ్‌వీర్ చాలా యాంగ్జియస్‌గా ఉన్నారు. అమితాబ్, షారుఖ్‌లాంటి వారు చేసిన కేరక్టర్ తనని వెతుక్కుంటూ రావడం పట్ల చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే నాకు ఎగ్జయిట్ కన్నా, బాధ్యత ఎక్కువగా ఉంది. రణ్‌వీర్ సింగ్ అమేజింగ్ హీరో. తను చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తాడు. ఒకప్పుడు డాన్2లో షారుఖ్ ని తీసుకున్నప్పుడు జనాలందరూ ఆశ్చర్యపోయారట. అమితాబ్ లాంటి లెజండరీ చేసిన రోల్‌ని షారుఖ్‌ని ఆఫర్ చేయడమేంటని అన్నారట. ఇప్పుడు కూడా అవే మాటలు కొన్నిచోట్ల వినిపిస్తున్నాయి. అప్పటి పరిస్థితే ఇప్పుడు రిపీట్ అవుతోంది. అయితే వాటన్నిటికీ సినిమా సమాధానం చెబుతుంది. స్క్రిప్ట్, సినిమా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి`` అని అన్నారు. 2025 జనవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు డాన్ 3ని.
Also Read